కలువరేకులకూ, నింగికీ మధ్య వెన్నెల రగులుతూనే ఉంది!


దోసిలినంతా నీ వెలుగును పులిమేసుకున్నాను
రెప్పలకంతా దట్టంగా నీ నిశిని కాటుకగా పెట్టుకున్నాను
స్వప్నాల వాకిలి తెరిచే ఉంది
నిదురకూ, మెలకువకూ మధ్య రాతిరి ఊగుతూనే ఉంది
కలువరేకులకూ, నింగికీ మధ్య వెన్నెల రగులుతూనే ఉంది
తూరుపు రేఖలకు అడ్డుపెట్టిన అరచేయి
వివశత్వాన్ని ఒడిసిపట్టిన కడలి తరంగం
నక్షత్రాలను ఏరుకుంటున్న అల్లరి పవనాలు
చలువ పందిర్లు వేసిన మనసు ముంగిలి
ఒక్క నీ రాక కోసం వేచి చూస్తున్నాయంటే నువ్వు నవ్వుతావ్!
ఆరంభలన్నింటినీ ఒక్క నువ్విచ్చే ముగింపు కోసం ఆపేసానంటే కొంటెతనమంటావ్!
కళ్ళ చుట్టూ కంచె కట్టేసాను
ఆత్మ సంకేతాలకు ఎర్ర జెండా ఊపేసాను
ఊహల గవాక్షం తెరిచే ఉంది
నిదురకూ, మెలకువకూ మధ్య రాతిరి ఊగుతూనే ఉంది
కలువరేకులకూ, నింగికీ మధ్య వెన్నెల రగులుతూనే ఉంది!

No comments:

Post a Comment